31న స్పందన-డయల్ యువర్ కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 31న సోమవారం స్పందన-డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10-30 నుండి 12 గంటల వరకు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన – డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా అర్జీదారులు తమ సమస్యలను (08518-277100) ఫోన్ ద్వారా మాత్రమే విన్నవించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్ కు రావద్దని ఏవైనా సమస్యలు వుంటే ఫోన్ ద్వారానే విన్నవించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.