NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టాలీవుడ్ ప‌బ్ పై దాడి.. 33 మంది అరెస్ట్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : హైద‌రాబాద్ లోని బేగంపేట టాలీవుడ్ ప‌బ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ప‌బ్ లో అసాంఘిక కార్యక‌లాపాల‌కు పాల్పడుతున్న 33 మంది పురుషుల‌తో పాటు 9 మంది మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలో ఇదే ప‌బ్ ను లిబ్సన్ ప‌బ్ పేరుతో నిర్వాహ‌కులు నిర్వహించారు. అప్పుడు కూడ అసాంఘిక కార్యక‌లాపాల‌కు అడ్డాగా మార‌డంతో పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అదే ప‌బ్ ను టాలీవుడ్ ప‌బ్ గా పేరుమార్చి మ‌రోసారి అసాంఘిక కార్యక‌లాపాల‌కు అడ్డాగా మార్చారు. పొట్టి దుస్తులు ధ‌రించే మ‌హిళ‌ల‌కు రోజుకు వెయ్యి ఇస్తూ పురుషుల‌తో క‌లిసి డాన్సులు చేయిస్తున్నారి పోలీసులు వివ‌రించారు. విచార‌ణ నిమిత్తం అరెస్టు చేసిన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజాగుట్ట పోలీసుల‌కు అప్పగించారు.

About Author