3,4,5 తరగతులను..‘ఉన్నత’లో విలీనం చేయొద్దు..!
1 min read– నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపిన ఫ్యాప్టో
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఏపీ నూతన విద్యావిధానంలో జరుగుతున్న సంస్కరణలలో భాగంగా 3,4 మరియు 5 ప్రాథమిక స్థాయి తరగతుల ను ఉన్నత పాఠశాలల యందు విలీనం చేయడం, ప్రధానోపాధ్యాయుల పై పని భారం పెంచడం తగదన్నారు FAPTO రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కర్నూలు మండలంలోని వసంత నగర్ పాఠశాల సిబ్బంది FAPTO జిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు నాయకత్వం లో నల్ల బాడ్జ్ లు ధరించి విధుల్లో పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సంపత్ కుమార్,జూనియర్ అసిస్టెంట్ వర ప్రసాద్ రెడ్డి, శ్రీమతి బేబీ సుజాత, లత, శ్రీమతి సరిత, పద్మావతి మొదలైన మహిళ ఉపాధ్యాయులు,శ్రీ మస్తాన్ వలి, నూర్ మహమ్మద్, పుల్లన్న, శ్రీనివాస రెడ్డి, మనోహర్,రమణ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.