NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్​లో.. మండలవాసికి 34వ ర్యాంకు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: చెన్నూరు  మండలంలోని ఉప్పరపల్లె గ్రామపంచాయతీ నివాసి గాజులపల్లె జయరామిరెడ్డి( జి జె ఆర్) మనవడు గాజులపల్లె వెంకట రమాకాంత్ రెడ్డి కి 2021 కి గాను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఆల్ ఇండియా 34 వ ర్యాంకు సాధించినట్లు మంగళ వారం సాయంత్రం గాజులపల్లె వెంకట రమాకాంత్ రెడ్డి పల్లె వెలుగు  కి తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  1 వ, నుండి 8వ తరగతి వరకు విద్యా మందిర్ స్కూల్ నందు అదేవిధంగా 9 వ, తరగతి నుండి పదవ తరగతి వరకు నారాయణ స్కూల్ నందు అలాగే ఇంటర్ నారాయణ కాలేజీ హైదరాబాద్, బీటెక్ ఐ ఐ టి (మెకానికల్ ఇంజనీర్) ఢిల్లీ నందు చదివినట్లు తెలిపారు, తన తండ్రి వెంకటరమణారెడ్డి కాజీపేట కాలేజీ లో లెక్చరర్గా పని చేస్తున్నారని, అలాగే తల్లి గృహిణి కాగా తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఉన్నత చదువులు చదివి, 2021 సంవత్సరమునకు గాను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో  ఆలిండియా 34 వ ర్యాంకు  సాధించినట్లు తెలిపారు.

About Author