NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా కమల కలానికేతన్ 37వవార్సికోత్సవాలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ స్థానిక గ్రంథాలయంలో అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన కమలా కళా నికేతన్ సాహితీ సంస్థ 37వ వార్షకోత్సవాలు ఘనంగా నిర్వహించారు.మొదట రచయిత్రి రామలింగమ్మ గారు జ్యోతి ప్రజ్వలనతో వార్షి కోత్సవాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా పుస్తకావిషకరణ  జరిగింది.కవి,రచయిత సవ్వప్ప గారి ఈరన్న గారు రచించిన 65 పుస్తకం “పల్లెలు నాడు నేడు” అనే పుస్తకాన్ని ఈశ్వర రెడ్డి గారు ఆవిష్కరించారు. డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు వెంకటేశ్వర యాదవ్ సమీక్షించారు. విశ్రాంత మండల రెవెన్యూ అధికారి  షేక్ షావలి ,వారి సతీమణి అమీనా బి కి ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు.ఈ సందర్భంగా కొత్తపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు, మానవతా విలువలు,సామాజిక చైతన్యం కలిగించే సాహిత్యం నేడు చాలా అవసరమని ఆయన అన్నారు.నేటి యువ రచయితలు ఆదిశగా కృషి చేయాలని కోరారు.సాహితీ సంస్థ స్థాపించి,స్వయంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు భాష పరిరక్షణకు గత 37సంత్సరకాలంగా కృషి చేస్తున్న ఈరన్న గారిని అభినందించారు.ఈ వార్షకోత్సవంలో రచయిత నల్లారెడ్డి మరియు అనేక మంది కవులను,రచయితలను,రంగస్థల నటులను తన సంస్థ తరుపున ఘనంగా సన్మానించారు.ఈ వార్షికోత్సవం లో ఈశ్వరప్ప,రవికుమార్,రంగన్న, కాశిమ్ శెట్టి,పులయ్య,ఉమాపతి,నాగరత్నమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.

About Author