PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

38 మందికి మరణశిక్ష.. దేశ చరిత్రలో తొలిసారి.. !

1 min read

పల్లెవెలుగువెబ్ : దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్‌ పాటిల్‌ తీర్పు వెలవరించారు. అహ్మదాబాద్‌లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి, మున్సిపల్‌​ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి.

           

About Author