NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

4 నుండి సయ్యద్ అల్లాబకష్ వలి ఉరుసు

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు నగర సమీపం లోని జొహరాపురం లో సయ్యద్ అల్లాబకాష్ వలి ఉరుసు జరుగుతుందని ముత్తవల్లి సయ్యద్ అఫ్సర్ పాషా తెలిపారు. .04-11-2022 శుక్రవారం గంధం 05-11-2022 శనివారం ఉరుసు(తట్టీలు) 06-11-2022 ఆదివారము కిస్తీలు (జియారత్ ).గ్రామంలో 3 రోజులు హిందువులు ,ముస్లింలు , క్రిస్టియన్లు ఐకమత్యంతో ఈ ఉరుసును జరుపుకుంటారని ,ఇది మతసామరస్యానికి ప్రతీక అని చెప్పారు .ఈ ఉత్సవానికి జిల్లా లోని వారే కాకుండా పక్కనున్న తెలంగాణ నుండి కూడా విశేషంగా భక్తులు హాజరవుతారని తెలిపారు.సయ్యద్ అల్లాబకాష్ వలి గారు గత 380 సంవత్సరాల క్రితం బీజాపూర్ నుండి ఇక్కడకు వచ్చి భక్తులకు అనేక మహిమలు చూపి ఇక్కడే సమాధి అయ్యారని ,17 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే జహీరాబి అనే ముస్లిం మహిళ సమాధి చుట్టూ దర్గా నిర్మించారని తెలిపారు .కాలక్రమేణా ఆ ప్రాంతానికి జొహరాపురం అనే పేరు వచ్చిందని నిర్వాహకులు అఫ్సర్ పాషా తెలిపారు.కావున జిల్లా నలుమూలలనుండి భక్తులు హాజరై ఆయన దయకు పాత్రులై ప్రసాదం స్వీకరించవలెనని కోరుచున్నాను . సయ్యద్ అఫ్సర్ పాషా ,ముత్తవల్లి .జొహరాపురం .కర్నూల్ సిటీ .

About Author