4వేల ఏళ్ల లడ్డూలు..తవ్వకాల్లో వెలుగులోకి
1 min readపల్లెవెలుగు వెబ్: నాలుగు వేల ఏళ్లనాటి లడ్డూలు బయటపడ్డాయి. రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా.. ఈ లడ్డూలు బయటపడ్డాయి. హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూలుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తవ్వకాల్లో బయటపడ్డ 7 లడ్డూలు 4 వేల ఏళ్లనాటివని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని రకరకాల పుష్టికరమైన ఆహారధాన్యాలతో తయారు చేశారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లడ్డూలు లభ్యంకావడం వల్ల హరప్పా నాగరికత కాలంలో ప్రజలు ఎలాంటి పౌష్టికాహారాన్ని వినియోగించారు అన్న విషయం బయటపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. లక్నోకు చెందిన బీర్భల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్స్, ఢిల్లీకి చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలు రాజస్థాన్ లోని బిన్ జోర్ ప్రాంతంలో హరప్పా నాగరికత కాలంనాటి స్థలంలో గత కొంత కాలంగా సర్వే జరుపుతున్నాయి. 2017 లో వారికి ఓ 7 లడ్డూలు దొరికాయి వాటిని పరిశోధించగా.. అవి 4 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేత్తలు తెలిపారు.