40 శాతం సీట్లు యువతకే !
1 min read
పల్లెవెలుగువెబ్ : గతంలో ప్రకటించినట్లు 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పని చేసేవారికే పదవులిచ్చేలా మెకానిజం తీసుకొస్తామని తెలిపారు. అక్రమ కేసుల్లో కార్యకర్తలు జైలుకెళ్తే.. నేతలు అండగా ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లాయర్‌ను పెట్టుకోవాలని, న్యాయ పోరాటంతో కార్యకర్తలను కాపాడుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. తప్పు చేసిన పోలీసులపై ప్రైవేట్ కేసులు ఎందుకు వేయట్లేదని నిలదీశారు.