40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు నాయుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదని సంకేతాలిస్తోంది. 40 ఏళ్ల క్రితం 1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అన్ని అంశాలతో పాటు పార్టీలో యువత భాగస్వామ్యంపై కూడా చర్చించారు. టీడీపీలోకి యంగ్ బ్లడ్ రావాలంటూ లోకేశ్ పిలుపు నిచ్చారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీలక సూచనలు కూడా చేశారు. దీంతో సమగ్ర అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేక కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నారా లోకేష్ సూచించారు. పార్టీలో నూతనత్వం, యువ రక్తం ఎక్కించేందుకు వేగంగా కసరత్తు చేపట్టాలని… యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని కూడా లోకేశ్ సూచించారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో యంగ్ బ్లడ్ తీసుకువచ్చే దిశగా అధినేత పావులు కదుపుతున్నారు.