NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీలేరులో 400కోట్ల కుంభ‌కోణం : న‌ల్లారి కిషోర్ రెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 400కోట్ల భూకుంభ‌కోణం జ‌రిగింద‌ని తెదేపా నేత న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో హైవేకి ఆనుకుని ఈ కుంభ‌కోణం జ‌రిగింద‌న్నారు. మంత్రి, ఎంపీ అండ చూసుకుని వైకాపా నేత‌లు భూ అక్రమాల‌కు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వ భూముల‌కు అక్రమంగా లే అవుట్లు వేసి విక్రయిస్తున్నార‌ని విమ‌ర్శించారు. జిల్లాలో భూ అక్రమాల‌పై స‌ర్వే నంబ‌ర్లతో స‌హా బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలిపారు. భూ కుంభ‌కోణంపై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. త్వర‌లో న్యాయ‌స్థానాన్ని ఆశ్రయిస్తామ‌ని తెలిపారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవ‌ని తెలిస్తే ప్రజ‌లు న‌ష్టపోతార‌ని ఆయ‌న అన్నారు. అక్రమాల‌పై స్థానిక అధికారుల‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పంద‌న లేద‌ని వాపోయారు.

About Author