ఖైదీలుగా 4 వేల మంది భారతీయులు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉపాధి కోసం పొట్ట చేతపట్టి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు జైలు పాలయ్యారు. స్థానిక చట్టాలను ఉల్లఘించి లేక ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 4వేల మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలకు చెందిన స్థానిక మీడియా తాజాగా వెల్లడించింది. సౌదీ అరేబియాలో అత్యధికంగా 1570 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్టు పేర్కొంది. యూఏఈలో 1292 మంది భారతీయులు జైలు జీవితం అనుభవిస్తున్నట్టు వెల్లడించింది. ఇదే విధంగా.. కువైత్‌లో 460 మంది, ఖతార్‌లో 439 మంది, బహ్రెయిన్‌లో 178 మంది, ఒమన్‌లో 49 మంది భారతీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు తెలిపింది. స్థానిక చట్టాలను ఉల్లఘించిన నేరంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8వేల మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్టు పేర్కొంది.