గంటకు 42 మంది మృతి.. వైరస్ విజృంభణ
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన వైరస్ దాడి ఏమాత్రం తగ్గడంలేదు. తగ్గినట్టే కనిపిస్తున్నప్పటికీ.. ముప్పు నివురుగప్పిన నిప్పులా ఉంది. అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. వ్యాక్సినేషన్ తో అమెరికాలో అదుపులోకి వచ్చినట్టు కనిపించినప్పటికీ.. మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కొత్త రూపు సంతరించుకోవడంతో మళ్లీ వైరస్ దాడి మొదలయింది. అమెరికాలో రోజూవారీ కోవిడ్ మరణాలు వెయ్యి దాటాయి. సరాసరి గంటకు 42 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ తర్వాత అమెరికాలో ఆంక్షలు సడలించారు. అనంతరం అనూహ్యంగా కరోన కేసులు, మరణాలు తగ్గాయి. ఇప్పటి వరకు వైరస్ కారణంగా అమెరికాలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6లక్షల 22వేలు దాటింది. ముందుముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది.