PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

43 కోట్లతో …కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు రైల్వేస్టేషన్ 43 కోట్లతో కూడిన  అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ,జిల్లాపరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,నగర మేయర్ బివై రామయ్య  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేయడం దేశానికి శుభసూచకం గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి  ధన్యవాదాలు తెలిపారు.. ముఖ్యంగా ఆధునీకరణ మన దేశం యొక్క ఖ్యాతిని నిలుపుతుందని అందులో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్ కూడా సుందరంగా తయారు అవుతుందని అని అన్నారు.. మరి ముఖ్యంగా కర్నూలు నా వంతు పార్లమెంట్ సభ్యుడుగా కర్నూలు నుండి మచిలీపట్నం కు రైలు ఏర్పాటుకు నేను కృషి చేస్తే ఒక సంవత్సరం కిందట అది ప్రారంభ0 అయ్యింది.. అది గత నెల రోజుల నుండి నిలిపివేశారు రైల్వే అధికారులు తక్షణమే రైలు కర్నూలు to మచిలీపట్నం రైల్ వేయవల్సిందిగా కోరారు..  మరియు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం చెయ్యాలని , పిక్ లైన్ ఏర్పాటు కోసంత నాలుగు సంవత్సరాలుగా  కృషి చేస్తూన్నాను ఇది వస్తే ఇక్కడే కర్నూలు నుండి  రైలు మొదలు అవుతుంది అని ఇంకా కొన్ని రైల్వే లైన్లు ,మరియు దూర ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల అవసరాల రీత్యా కర్నూల్ నుండి trains వేయవల్సిందిగా రైల్వే అధికారులని కోరారు.. దీని  కోసం నా వంతు కృషి చేస్తానని ఎంపీ గారు తెలిపారు.

About Author