PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

44 మంది స్వ‌లింగ సంపర్కులు అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్​: హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో 44 మంది స్వ‌లింగ సంప‌ర్కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక వివేక్ న‌గ‌ర్ లో వీరంతా రాత్రి పార్టీ చేసుకున్నారు. మ‌ద్యం, హుక్కా సేవించి డ్యాన్స్ లు చేశారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. పార్టీ నిర్వాహ‌కులైన ఇమ్ర‌న్, ద‌యాళ్ పై నిషేధిత హుక్కా వినియోగం పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మిగిలిన వారిపై పెట్టి కేసులు న‌మోదు చేశారు. వివేక్ న‌గ‌ర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నెల‌కు 30 వేలు చెల్లిస్తున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది క‌లిగిస్తున్నార‌ని స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీరికి కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

About Author