NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

44వ వార్డు టిడిపి కార్యాలయం ప్రారంభించిన టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలోని 44వ వార్డు ప‌రిధిలోని సీతారాం న‌గ‌ర్ ఆటోస్టాండ్ వ‌ద్ద టిడిపి యువ నాయకుడు మ‌నోజ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాన్ని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజ చేశారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు టిడిపి కార్యాల‌యం ఏర్పాటు చేయ‌డం సంతోషమన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఇప్ప‌టికిప్పుడు ప‌రిష్క‌రించ‌క‌పోయినా.. వారికి మేమున్నామంటూ భ‌రోసా ఇచ్చేందుకు వార్డులో పార్టీ కార్యాల‌యం ఉండాలన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంతో పాటు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించేందుకు నాయ‌కులంద‌రూ క‌ష్ట‌ప‌డాలని భరత్ చెప్పారు. అంత‌కుముందు ఆటో స్టాండ్ వ‌ద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన అసెంబ్లీ ఇంఛార్జీ హర్షద్, టిడిపి సీనియర్ నేతలు సోమిశెట్టి నవీన్, అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇంఛార్జీలు, మహిళా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author