ఎకరం 45 కోట్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కోకాపేట భూములు కోట్లు పలికాయి. ఎమ్ఎస్టిసి వెబ్ సైట్ ద్వార హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం ఎకరం కనీస ధర 25 కోట్లుగా నిర్ధారించింది. అయితే వేలంలో ఎకరం 45 కోట్లకు పైగా ధర పలికింది. కోకాపేటలోని ప్రభుత్వ భూములను వెంచర్ వేసి ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. 49 ఎకరాల భూమిని నాలుగు ప్లాట్లు గా విభజించింది. అత్యాధునిక సౌకర్యాలతో వెంచర్ ను ఏర్పాటు చేసింది. ఎకరం కనీస ధర 25 కోట్లుగా నిర్ధారించి ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్ కు నియోపోలిస్ గా హెచ్ఎండీఏ నామకరణం చేసింది. ఈ వెంచర్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.