49 బన్నూరులో త్రాగునీటి బోర్ కు పడ్డ నీళ్లు..
1 min read
గ్రామస్థుల సంతోషం: మాండ్ర..ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో మంగళవారం వేసిన త్రాగునీటి బోర్ కు నాలుగు ఇంచుల న్నీళ్లు పడ్డాయి.నీటి కొరత ఉందని గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు ఎస్ రమణారెడ్డి,ఎస్ సోఫీ సాహెబ్ మరియు గ్రామస్తులు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే వారు స్పందించి గ్రామానికి బోర్ ను పంపించారు. మధ్యాహ్నం రమణారెడ్డి,సోఫీ సాహెబ్ బోర్ కు టెంకాయలు కొట్టి బోర్ వేయించడం ప్రారంభించారు.భారీగా నీళ్లు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు మరియు గ్రామస్తులు శివానందరెడ్డి కి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.అతి తొందరలోనే జగనన్న కాలనీకి నూతన పైపులతో త్రాగునీటి సరఫరా అయ్యే విధంగా చూస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో చంటి, సురేష్,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.