NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎస్ వి రంగారావు 49వ వర్ధంతి…

1 min read

– నాటినుండి నేటి వరకు ఆయన్ని తెలుగు ప్రజలు ఆరాధిస్తున్నారు..

– బడేటి చంటి ఏలూరు టిడిపి నియోజకవర్గ కన్వీనర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏలూరు టోల్గేట్ సమీపాన మినీ బైపాస్ దగ్గర స్వర్గీయ నటరత్న  సామర్లకోట వెంకట రంగారావు  49వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎస్ వి ఆర్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్వీ రంగారావు అభిమానులు సందర్శించి నివాులర్పించారు. సామర్లకోట వెంకట రంగారావు  మేనల్లుడు,ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి ) మరియు ఎస్ వి రంగారావు  మనుమడు  (జూనియర్).ఈ సందర్భంగా బడేటి చంటి  మాట్లాడుతూ పలు భాషల్లో ఎన్నో చలనచిత్రాల్లో నటించి   వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని, నేటికీ తెలుగు ప్రజలు ఆయనను గుండెల్లో స్మరించుకోవడం ఆరాధించటం గొప్ప విషయం అన్నారు.మాజీమంత్రి,కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగుండి హరి రామ జోగయ్య, విశ్వ నటుడు ఎస్వీ రంగారావు, నవరస నటసార్వభౌముడు గా ప్రఖ్యాతిగాంచిన మరియు ఆంధ్ర రాష్ట్ర కళామతల్లి ముద్దుబిడ్డ కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చొడే వెంకటరత్నం, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ టిడిపి కార్పొరేటర్ మారం హనుమంతరావు (అను) ఆర్ ఎన్ ఆర్ రాజేశ్వరరావు, రెడ్డి నాగరాజు, మల్లెపు రాము, మాకాల రమేష్, రేవులగడ్డ లాలా తదితరులు పాల్గొన్నారు.

About Author