నామినేటెడ్ పదవికి 5.5 కోట్లు.. సంచలనం సృష్టిస్తోన్న లేఖ !
1 min readపల్లెవెలుగు వెబ్ : చిత్తూరు జిల్లా ఐరాల జడ్పీటీసీ వి.సుచిత్రకు నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్. బాబు 5.5 కోట్ల డబ్బు తీసుకున్నట్టు ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐరాల జడ్పీటీసీ సుచిత్ర సీఎం జగన్ కు రాసినట్టు ఉన్న లేఖలో పలు కీలక విషయాలు ఉన్నాయి. జడ్పీ వైస్ చైర్మన్, లేదంటే ఆర్టీసీ చైర్మన్, కుప్పం నియోజకవర్గ బాధ్యతలు ఇలా మూడింటిలో ఏదో ఒకటి ఇప్పిస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్. బాబు 5.5 కోట్లు తీసుకున్నట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు. పదవి ఇప్పించకపోవడంతో డబ్బు చెల్లించమని పలుమార్లు కోరానని, బెంగళూరుకు రమ్మని చెప్పి అక్కడ బెదిరించారని ఆ లేఖలో ఆరోపించారు. తమ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణహాని ఉందని సీఎం జగన్ తమను కాపాడాలంటూ లేఖలో ఉంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎంఎస్. బాబు తన పై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. అంతా దేవుడే చూసుకుంటారని అన్నారు.