ఉపాధ్యాయులకు 5 రోజులు శిక్షణా తరగతులు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా 2018 డిఎస్సి నందు ఎన్నిక కాబడిన పాఠశాల సహాయకులకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులను 15.5.2023 నుండి 19.5.2023 వరకు ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మిడ్తూరు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నందు కర్నూలు,అనంతపురం, కడప మరియు చిత్తూరు జిల్లాలలోని సాంఘిక శాస్త్ర పాఠశాల సహాయకులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులను కర్నూలు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్,మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి పి.మౌలాలి మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సలాం భాష ప్రారంభించారు.డాక్టర్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ఐదు రోజుల శిక్షణా తరగతులను ఉపయోగించుకొని సాంఘిక శాస్త్రంలోని మెలుకువలను తెలుసుకొని నైపుణ్యాలను పెంపొందించుకొని పూర్తి పరిజ్ఞానంతో మన పాఠశాలలో వచ్చే విద్యార్థులకు అభ్యసనను కొనసాగించాలని సూచించారు.మండల విద్యాశాఖ అధికారి మౌలాలి మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రమశిక్షణకు మారుపేరని ఈ ఐదు రోజులు మంచి క్రమశిక్షణతో పరిజ్ఞానాన్ని పొందాలని తెలియజేశారు.మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇక్కడ శిక్షణకు హాజరైనటువంటి ఉపాధ్యాయులకు చక్కని ఆహ్లాదకర వాతావరణము కలదని దీనిని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలను పొందాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులకు మొత్తము 131 మంది సాంఘిక శాస్త్ర పాఠశాల సహాయకులు నాలుగు జిల్లాల నుంచి హాజరు కావడం జరిగింది.వీరికి 10 మంది రిసోర్స్ పర్సన్స్ ఈ ఐదు రోజులు శిక్షణను నిర్వహిస్తారు.