NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్తి పన్నుపై 5% రాయితీ ఏప్రిల్ 30 వరకు మాత్రమే

1 min read

నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు

మూడు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

కర్నూలు, న్యూస్​ నేడు:  బుధవారం నగరంలో పన్నుదారుల సౌలభ్యం కోసం ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలను చెల్లించేందుకు, వివిధ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఏకమొత్తం చెల్లింపులపై 5% రాయితీ వర్తిస్తున్నందున, నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్నుదారుల రద్దీ పెరిగిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరపాలక కార్యాలయంతో పాటు ఈ క్రింద తెలిపిన ప్రాంతాల్లో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 30, 2025 వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పన్నులు చెల్లించవచ్చని తెలిపారు. అదేవిధంగా స్థానిక సచివాలయాలలో, అన్‌లైన్‌, మీ సేవ కేంద్రాలు, పురమిత్ర యాప్, వాట్సాప్ నెంబర్ 9552300009 ల ద్వారా సైతం పన్నులు చెల్లించవచ్చని  పేర్కొన్నారు. కావున పన్నుదారులు త్వరపడి తమ ఆస్తిపన్నుపై వచ్చే 5% రాయితీని పొందవలసిందిగా, నగరాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కమిషనర్ తెలిపారు.

ప్రత్యేక కౌంటర్ల వివరాలు:

1. కల్లూరు వార్డు కార్యాలయం – 85వ సచివాలయం

2. జె.యన్.ఆర్. నగర్ (రైతు బజార్ సమీపంలో) – 62వ సచివాలయం

3. బాలాజీ నగర్ – 104వ సచివాలయం

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *