బాధిత కుటుంబానికి 5 లక్షల ఎమ్మెల్యే అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గత నెల 7వ తేదీన చింతలపల్లె గ్రామానికి చెందిన కొట్టం చంద్రశేఖర్ నాయుడు అనే కౌలు రైతు 49 బన్నూరు గ్రామంలో పొలంలో మిరప తోటకు నీళ్లు కడుతుండగా కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే.శనివారం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ జలకనూరు గ్రామంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చారు.అక్కడే మృతుని భార్య లక్ష్మీదేవికి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్,నందికొట్కూరు వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్,ఇనాయతుల్ల,వెంకట్ చింతలపల్లె పంచాయతీ కార్యదర్శి వేల్పుల వినయ్ చంద్ర పాల్గొన్నారు.