5 లక్షల రూ. విలువ గల పరికరాలు విరాళంగా అందజేత
1 min read– శ్రీ సద్గురు దత్త కృపాలయం వారు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వీల్ చైర్ మరియు స్ట్రక్చర్స్, బిపి ఆపరేటర్స్ సెక్షన్ ఆపరేటసర్స్ విరాళం గురించి.
– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల శ్రీ సద్గురు దత్త కృపాలయం వారు వీల్ చైర్స్-15 మరియు స్ట్రక్చర్స్-15, బిపి ఆపరేటర్స్-20, సెక్షన్ ఆపరేటర్స్-10 సుమారు ఐదు లక్షలు విలువ గల సామాగ్రిని విరాళంగా ఆసుపత్రికి ఇచ్చినట్లు తెలియజేశారు.ఆస్పత్రిలో దాదాపుగా 12 సంవత్సరాల నుండి పేషెంట్స్ కు క్రమం తప్పకుండా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వారు 800 నుండి 1200 మంది పేషెంట్స్ కు రుచికరమైన భోజనం అందిస్తూ మహోన్నతమైన సేవా కార్యక్రమం చేస్తూ మరియు వారు ఇతర కార్యక్రమాలు కూడా చేస్తూ వైకుంఠ క్షేత్రం నడుపుతూ వారికి కావలసిన ఇండివిడ్యుల్ వెహికల్స్ ద్వారా కర్నూల్ పూర ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.శ్రీ సద్గురు దత్త స్వాముల వారికి అడిగిన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ వారు వెంటనే ఆసుపత్రికి కావలసిన పరికరాలను అందించడానికి ముందుకు వచ్చి ఐదు లక్షల రూపాయలు విలువ గల పరికరాలను ఈరోజు అందించినట్లు తెలిపారు.శ్రీ సద్గురు దత్త కృపాలయం వారు ముందుకొచ్చి విరాళం చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, మరియు శ్రీ సద్గురు దత్త సేవా సిబ్బంది, శ్రీ.మల్లారెడ్డి, శ్రీధర్, శ్రీ.రాకేష్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.