5 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో గురువారం ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్ల జోష్ ను పెంచాయి. ఎన్నికలు జరిగిన ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించడం భారీ లాభాలకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఇన్వెస్టర్లు 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించారు. ఈ ఫలితాలతో మోదీ ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉందన్న సెంటిమెంట్ ఆద్యంతం లాభాల్లో కొనసాగేలా చేసింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సంధి ప్రయత్నాలు జరగుతున్నాయి. ఈరోజు టర్కీలో ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. క్రూడ్ ఆయిల్ ధరలు కూడ అదుపులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశాల కారణంగా సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 817 పాయింట్ల లాభంతో 55464 వద్ద, నిఫ్టీ 249 పాయింట్ల లాభంతో 16,594 వద్ద ట్రేడింగ్ ముగించాయి.