50 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణలో 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు ఇంతవరకు అధికారం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.