3 రోజుల్లో 50 మంది మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు మూడు రోజులుగా పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు రాష్ట్రాల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న వర్ష బీభత్సంలో యాభై మందికి పైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన మూడు రోజుల్లో వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లోనే 36 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క శనివారమే 22 మంది చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. ఉత్తరాఖండ్, ఒడిశాలోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. వరదలతో అనేక జిల్లాలు జలమయమయ్యాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ తీవ్రతకు పలు చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.