NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యస్ బ్యాంక్ లాభంలో 50 శాతం వృద్ధి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ య‌స్ బ్యాంక్ త్రైమాసిక ఫ‌లితాలు ప్ర‌క‌టించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదిక న యస్‌ బ్యాంక్‌ నికర లాభం 50 శాతం వృద్ధి చెంది రూ.310.63 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.206.84 కోట్లుగా ఉంది. కాగా జూన్‌ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం రూ.314.14 కోట్లుగా ఉంది. ఈ కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,394 కోట్ల నుంచి రూ.5,916 కోట్లకు పెరిగింది. కీలక ఆదాయాలు పెరగటంతో పాటు మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు తగ్గటం జూన్‌ త్రైమాసికంలో కలిసి వచ్చిందని యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

                                                       

About Author