‘శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి’కి..50వేలు విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు సికింద్రాబాద్ వాస్తవ్యులైన M నాగేందర్ & సన్స్ వారు Rs.50,001/- ను ఆన్లైన్ ద్వారా విరాళంగా అందజేశారు. శనివారం దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం మరియు ఆశీర్వాదాలు కల్పించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, బాండు ను అందించి పూలమాలతో సత్కరించారు.