NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వర‌లో 50 వేల ఉద్యోగాలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఉద్యోగాల భ‌ర్తీపై సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ఉన్నత‌స్థాయి భేటీ జ‌రిగింది. తొలిద‌శ‌లో అన్ని శాఖ‌ల్లో క‌లిపి 50 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. రెండో ద‌శ‌లో ప్రమోష‌న్ల ద్వార ఏర్పడే ఖాళీల‌తో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. భ‌ర్తీ ప్రక్రియ‌ను త‌క్షణ‌మే చేపట్టాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూత‌న జోన‌ల్ విధానానికి ఇటీవ‌లే రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించింది. ఉద్యోగాల భ‌ర్తీకి అన్ని ర‌కాల ఇబ్బందులు తొల‌గిపోయాయ‌ని కేసీఆర్ అన్నారు. పూర్తీ స‌మాచారంతో నివేదిక సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎం కేసీఆర్​, తెలంగాణ, ఉద్యోగాలు, నోటిఫికేషన్​, జోనల్​ వ్యవస్థ, ప్రమోషన్లు,

About Author