NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

500 మంది ఉద్యోగులు.. ఒక్కరోజులో కోటీశ్వరులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కోట్లు సంపాదించాలంటే సాధార‌ణ ఉద్యోగుల‌కు కొన్ని సంవ‌త్సరాల స‌మ‌యం ప‌డుతుంది. కానీ అమెరికాకు చెందిన ఫ్రెష్ వ‌ర్క్స్ సంస్థ ఉద్యోగుల‌కు మాత్రం ఒక్కరోజు స‌మ‌యం ప‌ట్టింది. అదెలాగంటే .. ఫ్రెష్ వ‌ర్క్స్ కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ నాస్ డాక్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ చేసిన ఒక్కరోజుల కంపెనీ షేరు ధ‌ర 32 శాతం మేర పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ 13 బిలియ‌న్ డాల‌ర్లకు చేరుకుంది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 4,300 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 500 మంది భార‌తీయులు ఉన్నారు. ఫ్రెష్ వ‌ర్క్స్ కంపెనీ భార‌త కంపెనీ. అవ‌స‌రాల దృష్ట్యా అమెరికాకు త‌ర‌లించారు. ఫ్రెష్ వ‌ర్క్స్ కి సంబంధించిన ఉద్యోగుల‌కు ఈ కంపెనీలో షేర్లు ఉన్నాయి. కాగా.. కంపెనీలో ప‌నిచేస్తున్న 500 మంది భార‌త ఉద్యోగులు కోటీశ్వరుల‌య్యార‌ని సంస్థ వ్యవ‌స్థాప‌కుడు గిరీష్ మాతృబూతం తెలిపారు.

About Author