క్యాన్సర్ బాధితుడికి 52 వేలు ఆర్థిక సాయం
1 min read– ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుక
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సినీ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీ రామారావు జన్మదిన వేడుకలు మిడుతూరు మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి మండల అధ్యక్షుడు డాక్టర్ ఎంఎం భాష ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి.ముందుగా మిడుతూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీకాంత్ (25)లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.వైద్య ఖర్చుల నిమిత్తానికి గాను ఎన్టీఆర్ అభిమానులు అందరు కలిసి 52 వేల రూపాయలు వసూలు చేసి ఈ నగదును శ్రీకాంత్ ఇంటి దగ్గరికి వెళ్లి కర్నూలు ఎన్టీఆర్ సంఘం జిల్లా అధ్యక్షుడు చౌదరి మరియు నందికొట్కూరు తాలూకా అధ్యక్షుడు అబ్దుల్లా తదితరులు కలిసి శ్రీకాంత్ కు నగదును అందజేశారు.ఆర్థిక సహాయం అందించినందుకు గాను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఖాజా,లడ్డు,మన్సూర్,హుసేన్,వైస్ ప్రెసిడెంట్ మద్దూరు బుజ్జి,మిడుతూరు మధు,లక్ష్మయ్య,అబ్బాస్,ఎం.దాస్ తదితరులు పాల్గొన్నారు.