54 యాప్ లను నిషేధించిన కేంద్రం !
1 min readపల్లెవెలుగువెబ్ : జాతీయ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 2020 జూన్ నెల నుంచి టిక్ టాక్, షేర్ ఇట్, వి ఛాట్, హెలో, లైకీ, బిగో లైవ్ తదితర 224 చైనీస్ స్మార్ట్ యాప్ లను ప్రభుత్వం నిషేధించింది. యాప్‌లలో బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్‌కార్డ్ ఫర్ సేల్స్‌ఫోర్స్ ఎంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మియోజీ చెస్, ఆన్‌మియోక్అరేనా డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లను నిషేధించింది.