ఘనంగా శ్రీ కృష్ణ దేవరాయల 552వ జయంతి సభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గొలుసు కట్టు కాలువలు చెరువుల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించిన గొప్ప మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలని, ఆ మహానుభావుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాయలు అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కన్వీనర్ కోనేటి చంద్రబాబు అన్నారు. కర్నూలు నగరంలో బలిజ కాపు యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన శ్రీ కృష్ణ దేవరాయల 552 జయంతి సభలో బలిజ సంఘం పెద్దలు కోనేటి చంద్రబాబు, కొట్టే చెన్నయ్య, యర్రంశెట్టి నారాయణ రెడ్డి, చింతలపల్లి రామకృష్ణ, పత్తి ఓబులయ్య, గన్నపురెడ్డి శ్రీనివాస్, కొండా విజయ్, దంతెల రమణ, మిద్దె ప్రసాద్, గాజుల కృష్ణ కుమార్, హుస్సేనాపురం నారాయణ రెడ్డి, శ్రీకాంత్, గురుమూర్తి, అనిమి రెడ్డి, మధుసూదన్, కొణిదెల శ్రీనివాస రెడ్డి తదితరులు కలసి పాలాభిషేకం చేసి, పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలు గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగిన గొప్ప చక్రవర్తి అని కొనియాడారు. రత్నాలు రాశులుగా పోసి అమ్మిన ఘన చరిత్ర భారతదేశానికి రాయలు వారి పరిపాలన కాలంలోనే దక్కిందన్నారు. రాయల వారిని ఆదర్శంగా తీసుకొని నేటి పాలకులు రాయలసీమలో సాగునీటి కోసం రిజర్వాయర్స్, ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల అశోక్ కుమార్, ఓజా నవీన్ కుమార్, బండి ఉపేంద్ర, పెద్దపాడు లక్ష్మన్న, శోభన్, వాసు, ఇంజనీర్ శ్రీనివాసులు తదితరులు పాల్గోన్నారు.