‘స్పందన’కు…56 ఫిర్యాదులు..
1 min read– ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి
–పోలీసు సిబ్బందిని ఆదేశించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “స్పందన”( గ్రీవెన్స్ డే) కార్యక్రమం ను అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర రావు ఐపిఎస్ గారు.నిర్వహించారు. జిల్లా ఎస్పి గారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఈ రోజు నిర్వహించిన “స్పందన”( గ్రీవెన్స్ డే) కార్యక్రమం లో 56 పిటీషన్లు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చట్ట ప్రకారం పరిష్కారం చూపాలని ఆయా అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీసు అధికారులును ఆదేశించారు. ఎస్పీ గారు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. స్పందన’ కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులుపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవలసిందిగా, ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం అందించవలసిందిగా, తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు పోలీసు ప్రదాన కార్యాలయానికి అందించవలసిందిగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.