56వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ముగింపు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : 56వ వారోత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలు ఈరోజు ఉదయం పెదపాడు శాఖా గ్రంథాలయంలో విద్యార్థులచే సామూహిక స్వీయ పట్టణం నిర్వహించబడినది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభ బహుమతుల ప్రధనోత్సవమునకు ముఖ్య అతిథులుగా అక్కినేని రాజశేఖర్ అధ్యక్షులు పెదపాడు విశాల సహకార పరపతి సంఘం, సుబ్రహ్మణ్యేశ్వర రావు ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పెదపాడు,పి వెంకటేశ్వరరావు జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం, వేల్పుల ప్రభాకర్ ఎంపీపీ స్కూల్ హెచ్ఎం , కే రామకృష్ణ, మానవతా అధ్యక్షులు పెదపాడు, జూనియర్ కాలేజీలు లైబ్రేరియన్ నాయుడు ,శ్రీకృష్ణ గురుకులం హెచ్ఎం ఆర్ బెంజిమెన్ గారు ,జడ్పీహెచ్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ శ్రీనివాస్, పాల్గొనినారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులందరూ గ్రంథాలయమునకు వచ్చి మీ పుస్తకములతో పాటు గ్రంథాలయంలోని వివిధ పుస్తకములు చదువుట వలన విజ్ఞానం పెంపొందించుకొనవలసినదిగా కోరరు. క్రమం తప్పకుండా గ్రంధాలయం కు వచ్చుట అలవాటు చేసుకోవలసినదిగా తెలియజేసినారు. సభ అనంతరం ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా నిర్వహించినటువంటి పోటీలు చిత్రలేఖనం, వ్యాసరచన ,వకృత్వం, క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ ,తృతీయ బహుమతులు ఈ కార్యక్రమమునకు హాజరైన అతిధులచే బహుమతి ప్రధానం చేయబడినది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాఠకులు పాల్గొన్నారు. పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. వందన సమర్పణ గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు చేసి అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచినారు. 56 జాతీయ గ్రంథాల వారోత్సవాలు ముగుస్తున్నట్లు ప్రకటించినారు.