5జీ వేలం నేడే !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో తొలిసారిగా 5జీ టెలికాం తరంగాల వేలం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. వేలం ఎన్ని రోజులు జరుగుతుందనేది స్పెక్ట్రమ్‌కు బిడ్డర్ల నుంచి లభించే డిమాండ్, కంపెనీల బిడ్డింగ్ వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని టెలికాం శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి ప్రభుత్వం రూ.4.31 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ల స్పెక్ట్రాన్ని విక్రయించనుంది. బిడ్డింగ్ విజేతలకు స్పెకా్ట్రన్ని 20 ఏళ్ల కాలానికి కేటాయిస్తారు. ఈసారి స్పెక్ట్రమ్ దక్కించుకున్న టెలికాం కంపెనీలు అప్‌ఫ్రంట్ చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదు. రుసుమును 20 వార్షిక వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.