త్వరలో 5జీ.. కేబినెట్ కీలక నిర్ణయం !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతిస్తూ భారీ నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరునాటికి దీనిని వేలం వేస్తారు. 20 ఏళ్ళ చెల్లుబాటు కాల పరిమితితో 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తారు. ఇది 4జీ కన్నా 10 రెట్ల వేగంతో పని చేస్తుంది. త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 5G spectrum వేలానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 72 GHz స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ళపాటు చెల్లుబాటయ్యే విధంగా వేలం వేస్తారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి విధానపరమైన నిర్ణయాలను అమలు చేస్తుండటంతో డిజిటల్ అనుసంధానం చాలా ముఖ్యమైనదిగా మారింది.