ఆశ్రం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 5కె రన్
1 min read
ప్రారంభించిన సి.ఇ.ఒ.డా: కె.హనుమంతరావు
నడకతో ఆరోగ్యానికి తొలి అడుగు వేద్దాం
రేపటి తరానికి ఆరోగ్య వంతమైన భవిషత్తును అందిద్దాం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని,ఆశ్రం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, 5కె వాక్ ను ప్రారంభించారు ఆశ్రం హాస్పిటల్స్ సి.ఇ.ఒ. డా: కె హనుమంతరావు, ఆదివారం ఏప్రిల్ 7వ తేదీ 2025 యావత్ ప్రపంచం ఆరోగ్య దినోత్సవముగా నిర్వహించుకోవడం జరుగుతోందని, ఈ సందర్భంగా ఆరోగ్యమే, మహాభాగ్యము అనే అనానుడిని ప్రంపచం అలవాటు చేసుకొంటోందని.. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దయనందిన యాంత్రిక జీవన విధానము వలన ఎంతగానో ఒత్తిడికి గురి అవుతున్నారని, తద్వారా డయాబెటిస్,, రక్తపోటు వంటి జీవన విధాన పరమైన వ్యాధులు, రుగ్మతలు పెరుగుతున్నాయని తెలియజేసారు. సగటు మానవునికి నడక ఎంతో ఉపయోగపడుతుందని, నడక ద్వారా చాలా వ్యాధులు రాకుండా శరీరం ఆరోగ్యవంతముగా ఉంటుందని తెలియజేసారు. నేటి యువతరాని ఉన్న ప్రధాన సమస్య ఒత్తిడి అని, పొద్దున్నే నడవటం ద్వారా కేవలం శారీరకంగానే కాకుండా, మానసిక ఉల్లాసం కలిగి తమ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టి చక్కటి జీవన విధానాన్ని అవలంబించుకోవాలని ఆయన సూచించారు.ప్రముఖ యూరాలజిక్ట్, డా:రమేష్ పర్యవేక్షణలో, ఆశ్రం యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా:రమేష్ మాట్లాడుతూ మన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చక్కటి ఆరోగ్యాన్ని దూరం చేసుకొంటున్నామని.. వైద్యునిగా సమాజానికి ఆరోగ్యాన్ని అందిచాల్సిన మనం ఈ యాంత్రిక విధానపు చట్రంలో పడి మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నామని, అందుకనే విద్యార్థి దశనుండి ఆరోగ్య పరిరక్షణ మన దినచర్యలో భాగమవ్వాలని ఉద్దేశ్యంతో ఆశ్రం వైద్య విద్యార్థులతో ఈ చక్కటి కార్యక్రమం చేపట్టామని తెలియజేసారు.ఆశ్రం మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డా: వేణుగోపాల్ రాజు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో ప్రజలకు ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పిస్తుందని.ఈ సంవత్సరం గర్భిణి స్త్రీలకు, నవజాత శిశువుల ఆరోగ్యం మరియు వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుల గూర్చి అందరికి అవగాహన కల్పించవలెనని సూచించినట్లు తెలియజేసారు. స్వీయ ఆరోగ్య సంరక్షణ, తద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరిరక్షణ కేవలం అవగాహన ద్వారా మాత్రమే కలుగుతాయని, స్వీయ క్రమశిక్షణ కలిగిఉండటం ప్రాధమిక సూత్రం అని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశ్రం మెడికల్ కాలేజి,నర్శింగ్ కాలేజి,పారామెడికల్ కాలేజి విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతము చేసారు.