60 లక్షల కేజీల చికెన్ లాగించేశారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : సంక్రాంతి సందర్భంగా ఎన్నడూ లేని విధంగా చికెన్ లాగించేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కేజీల చికెన్ కొనుగోలు చేశారు. మటన్ ధరతో పోల్చుకుంటే చికెన్ ధరలు తక్కువ ఉండటంతో చికెన్ వైపే ప్రజలు మొగ్గుచూపారు. మటన్ ధరలు కిలో. 850 నుంచి 900 పలకగా.. చికెన్ ధర కిలో 240 పలికింది. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు అంచనా. మామూలు రోజుల్లో మటన్ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి.