NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిసి రోడ్లకు 60 లక్షల నిధులు మంజూరు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో సిసి(సిమెంట్ రోడ్లు)రహదారులకు 60 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం కింద మంజూరు అయినట్లు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ మరియు మండల నాయకులు మల్లు శివ నాగిరెడ్డి తెలిపారు.శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించారని వారు తెలిపారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కొరకు సిద్ధార్థ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారని అన్నారు.గ్రామాల వారీగా రహదారులకు మంజూరు అయిన వివరాలు:కడుమూరు 12 లక్షలు,వీపనగండ్ల 9 లక్షలు,తిమ్మాపురం 6 లక్షల 50 వేలు,నాగలూటి 5 లక్షలు, మాసపేట 10 లక్షలు,చౌటుకూరు 5 లక్షలు, చెరుకుచెర్ల 7 లక్షల 50 వేలు, బైరాపురం 5 లక్షలు మంజూరు అయ్యాయి.ఈ గ్రామాల్లో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మల్లు శివ నాగిరెడ్డి తెలిపారు.శుక్రవారం సాయంత్రం కడుమూరు గ్రామంలో ఆంజనేయ స్వామి రహదారిలో రోడ్డును గ్రామ వైసీపీ నాయకులు శంకర్ రెడ్డి,విశ్వం రెడ్డి,గ్రామ సర్పంచ్ జీవరత్నం మరియు నాయకులు రోడ్డును వేయుట గురించి గ్రామ ప్రజలతో మాట్లాడారు.

About Author