PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్కొక్క జంటకు 60 వేల రూ. చెక్కులు అందజేత

1 min read

– పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు తమకోసం కాకుండా కుటుంబం కోసం జీవించాలి

– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి.

పల్లెవెలగు వెబ్ కర్నూలు:  జీవితంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు తమ కోసం కాకుండా కుటుంబం కోసం బతకడం అలవాటు చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సౌజన్యంతో టీజీవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ వివాహాలు చేసుకున్న 52 జంటలకు టీజీవీ గ్రూపు సంస్త ల సీ.ఎం.డీ. టీజీ భరత్  ఒక్కొక్క జంటకు 60 వేల రూపాయల చెక్కులను  అందజేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్  పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, కుమారుడు టీజీ భరత్, ఆయన సతీమణి శ్రీమతి శిల్పా భరత్, కుమార్తెలు కృష్ణ జోష్న, మౌర్య, మనవరాలు పాణ్యా, పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్  అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నూతన జంటలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ఫ్యాక్టరీలో పొగ, మద్యం తాగని వారికి నాన్ స్మోకిం,గ్ నాన్ ఆల్కహాలిక్ అలవెన్స్లుగా 3000 మందికి దాదాపు నెలకు 45 లక్షల రూపాయలను అందజేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మామూలుగా ఉన్న వారికే  అనారోగ్యాలు వస్తున్నాయని ఇక పొగ,మద్యం సేవించడం ద్వారా డబ్బులు పెట్టి మరి వ్యాధులను తెచ్చుకోవడం ఎందుకని అన్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో వివాహాలు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారు ఎవరైనా ఉంటే తమ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో కుటుంబం కోసం జీవించాలని సూచించారు. భవిష్యత్తులో వారికి ఏదైనా అవసరమైతే సహాయం చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. గతంలో ఆర్థికంగా ఉన్న వారి కుటుంబాల్లో జరిగే విధంగా ఫంక్షన్ హాల్ లో సామూహిక వివాహాలు చేసేవారమని, అయితే కరోనా వచ్చిన తర్వాత సామూహిక కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేని కారణంగా అవి చేయడం లేదని వివరించారు. అందుకే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వివాహాలు ఎవరి ఇళ్ల వద్ద వారు చేసుకునే విధంగా చేశామని చెప్పారు. పెళ్లి చేసుకున్న నూతన దంపతులకు ఒక్కొక్క జంటకు 60 వేల రూపాయలతో పాటు పెళ్లి బట్టలు, తాళిబొట్టు, కాళ్ల మెట్టెలు,  అందజేయడం జరిగిందని తెలిపారు. టిజివీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన సౌజన్యంతో పెళ్లిళ్లు చేసుకున్న ప్రతి ఒక్కరికి వివాహ శుభాకాంక్షలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు.

About Author