వారానికి 6,000 కోట్ల సంపాదన !
1 min readపల్లెవెలుగువెబ్ : అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ సంపద గత ఏడాదిలో వారానికి సగటున రూ.6,000 కోట్ల చొప్పున పెరిగిందని ‘2022 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ వెల్లడించింది. 2021 మొత్తానికి అదానీ ఆస్తి 4,900 కోట్ల డాలర్లు పెరిగిందని తెలిపింది. ప్రపంచంలోని టాప్-3 కుబేరులైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ గత ఏడాది పోగేసిన సంపద కంటే ఇది అధికం. హురున్ తాజా నివేదిక ప్రకారం.. అదానీ మొత్తం నెట్వర్త్ 153 శాతం వార్షిక వృద్ధితో 8,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాదికిగాను భారత్తో పాటు ఆసియాలోనూ అదానీయే రెండో అత్యంత ధనవంతుడు. ప్రపంచ ర్యాకింగ్స్లో ఆయనకు 12వ స్థానం దక్కింది.