PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐటియుసి ఆధ్వర్యంలో డిఈ పిలగలకు 60వ జన్మదిన వేడుకలు..

1 min read

– కొండలరావు సేవలు అభినందనీయం..అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలగల కొండలరావు షష్టిపూర్తి కార్యక్రమాన్ని ఏఐటియుసి అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కొండలరావు కి ఏఐటియుసి జిల్లా కన్వీనర్ యూనియన్ అధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు వాటర్ సప్లై ఏఈ సాయి పిట్టర్ సిహెచ్ హరినాథ్ శాలువ కప్పి పూలదండ వేసి సత్కరించారు. ఇంజనీరింగ్ విభాగంనకు చెందిన అనేక మంది ఉద్యోగ సిబ్బంది పూలదండలు పుష్పగుత్యాలు శాలువలతో కొండలరావు పి షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. కొండలరావు చే 60వ జన్మదినోత్సవ కేక్ ని కట్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాటర్ సప్లై మరియు డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజనీర్ కొండలరావు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఆయన సర్వీస్ కాలంలో ఎన్నో సేవలు చేస్తున్నారన్నారు. మిగిలిన సర్వీస్ లో కూడా మంచి సేవలు చేసి 2025లో పదవి ఆయురారోగ్యాలతో విరమణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాహు ఉద్యోగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author