జాతీయలోక్ అదాలత్ ద్వారా 6,325 కేసులు పరిష్కారం
1 min read
కేసుల పరిష్కారానికి సహకరించిన అధికారులకు, కక్షిదారులకు కృతజ్ఞతలు
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సురేష్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈనెల 05 వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలు ఏర్పాటు చేసి శనివారం రాత్రి వరకు కేసులను పరిష్కరించి నట్లు ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 6,325 కేసులను పరిష్కరించామని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో 20 సంవత్సరములు పెండింగు ఉన్న కేసును రాజీ చేయడం జరిగిందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీసు,రెవెన్యూ,ఇన్సూరెన్స్, అగ్రికల్చర్, లేబరు,నగర పాలక, రవాణా, రైల్వే,ఎక్సైజ్, బ్యాంకు,సంబంధిత అధికారులకు,చిట్ ఫండ్ ప్రతినిధులకు,బిఎస్ఎన్ఎల్ వారికి,ప్రింటు & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అడ్వకేట్సు సిబ్బందికి, సహకరించిన వారందరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ-కమ్ సీనియర్ సివిల్ జడ్జి కె.రత్నప్రసాదు కృతజ్ఞతలు తెలియజేశారు.