PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

64 వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవ వేడుకలు

1 min read

సందర్భంగా క్రీడలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్…

విభిన్న ప్రతిభావంతులు క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి…

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .సృజన…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన కర్నూలు పట్టణ జిల్లా క్రీడా ప్రాంగణంలో 64వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం వేడుకల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పరుగు పందెం క్రీడల కు గాను ఆకు పచ్చ జెండా ను  ఊపి ప్రారంభించినారు.సోమవారం ఉదయం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారి స్టేడియంలో 64వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల పరుగు పోటీలను జిల్లా కలెక్టర్ ఆకుపచ్చ జండా ఊపి ప్రారంభించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరు ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో , ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు దోహదం చేస్తాయని , వారి క్రీడల పట్ల సంబంధిత అధికారులు ఎల్లప్పుడూ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన వారిని ఆదేశించారు.ఈ విభిన్న ప్రతిభావంతులకు వివిధ కేటగిరిలో వారి వయస్సు ప్రకారం ఆటలు పోటీలు నిర్వహిస్తున్నామని ఆ శాఖ అధికారి రఈస్ ఫాతిమా కలెక్టర్కి తెలియజేశారు .ఇందులో షాట్ పుట్ , డిస్కస్ త్రో , పరుగు పందెం , వాలీబాల్ , మూడు చక్రాల వాహనాల పోటీ , జావిలిన్ త్రో మొదలగు అంశాలు ఉంటాయని విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తామని కలెక్టర్కి తెలియజేశారు.జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి , క్రీడా ప్రాంగణ అధికారి రమణ , డిఈఓ రంగారెడ్డి , విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి రఈస్ ఫాతిమా , పర్యవేక్షకులు సల్మాన్ రాజు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author