దగ్గు మందు తాగి 66 మంది చిన్నారులు మృతి
1 min readపల్లెవెలుగువెబ్: దగ్గు ఉపశమనానికి వాడిన సిరప్ 66 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొంది. గాంబియా అనే ఆఫ్రికన్ దేశంలో ఇది చోటు చేసుకుంది. ఈ దగ్గు ఉపశమన ద్రావకాన్ని (సిరప్) భారత్ లోని హర్యానా రాష్ట్రం సోనేపట్ కు చెందిన మెయిడన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ తయారు చేసినట్టు తేలింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని అప్రమత్తం చేసింది. దీంతో హర్యానా కంపెనీ తయారు చేసిన నాలుగు కాఫ్ సిరప్ లపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. డీసీజీఐ వెంటనే ఈ విషయాన్ని హర్యానా రాష్ట్ర ఔషధ మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పాయి. మెయిడన్ ఫార్మాస్యూటికల్ ఈ కాఫ్ సిరప్ లను కేవలం గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్టు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.