NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నృసింహ సేవా వాహిని 6 వ వార్షికోత్సవం

1 min read

– భక్తులకు అన్న ప్రసాద వితరణ
పల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ: వైష్ణవక్షత్రమైన అహోబిలం లో మంగళవారం శ్రీ నృసింహ సేవా వాహిని 6 వ వార్షికోత్సవo సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి సూచన మేరకు అహోబిలం ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్య స్వామి ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా ఇంచార్జి రవికాంత్ చౌదరి, ఉప్పల ప్రసాద్ ల ఆధ్వర్యంలో లో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్బంగా రవికాంత్ చౌదరి మాట్లాడుతూ శ్రీ నృసింహ సేవా వాహిని సంస్థను స్థాపించిన నేటికీ 5 వసంతాలు పూర్తిచేసుకుని ఆరవ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్బంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం జరిగినదని, సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ కరోనా కష్టకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించడం జరిగినదన్నారు. అలానే వరదల సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యవసర సరుకులు, అన్న ప్రసాదం, దుస్తులు అందజేయడం జరిగినద అన్నారు. మున్ముందు ఇంకా ఎన్నో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకునే భాగ్యాన్ని ఆ లక్ష్మీనరసింహస్వామి మా నృసింహ భక్త కుటుంబం అందరికీ ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో నృసింహ సేవా వాహిని బృందం మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author