ఘనంగా శ్రీ షిరిడిసాయి ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవం
1 min read
భక్తిశ్రద్ధలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
వేలాదిమందికి అన్న ప్రసాద వితరణ
పెద్ద ఎత్తున వార్షికోత్సవ వేడుకల కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులు
ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన కమిటీ సభ్యులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవం మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగగా అత్యంత వైభవంగా కోలాహాలాలతో భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ వారు స్థానిక ప్రాంత ప్రజల మరియు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు. శ్రీ షిరిడి సాయినాధునికి గణపతి పూజ, సాయి సేవ మాల ధారణ,పల్లకి సేవ,హారతులు, సంకీర్తనలు,పుష్పాభిషేకములు, అఖండహారతులు, కోలాటాలు, దీపోత్సవ కార్యక్రమాలతో మార్చ్ 20వ తేదీ గురువారం నుండి 24వ తేదీ సోమవారం వరకు నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగాయి. 23వ తేదీ ఆదివారం మహా అన్న సమారాధన వేలాది మందికి కమిటీ సభ్యుల, భక్త బృందం మరియు దాతల సహాయ సహకారంతో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు విచ్చేశారు. కమిటీ సభ్యులు వీరిని ఆలయ మర్యాదలతో శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కి తీర్థప్రసాదాలు అందించారు. భక్తిశ్రద్ధలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ సాయినాధుని వేడుకొన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
