PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7 న-డయల్ యువర్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ  స్పందన-డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10-30 నుండి 12 గంటల వరకు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో  స్పందన – డయల్ యువర్ కలెక్టర్  కార్యక్రమం ద్వారా  అర్జీదారులు తమ సమస్యలను (08518-277100) ఫోన్ ద్వారా మాత్రమే విన్నవించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్ కు రావద్దని ఏవైనా సమస్యలు వుంటే  ఫోన్ ద్వారానే విన్నవించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

About Author